గచ్చిబౌలి: కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో ఐటీ కారిడార్‌లో ఉన్న వందలాది ఐటీ కంపెనీలు తమ రోజువారి కార్యకలాపాలను ఆపివేశాయి. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంకు అవకాశం కల్పించాయి. లక్షలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇప్పుడు కార్యాలయాలకు రావడం లేదు. వారంతా ఇప్పుడు ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. అయితే కంపెనీలలో కూర్చుని పరిమిత గంటల్లో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇప్పుడు కొంత ఎక్కువగానే పని చేస్తున్నామని చెబుతున్నారు. తమ పనుల్లో ఎక్కడా జాప్యం జరగడం లేదని పేర్కొంటున్నారు. ఇంట్లోంచి పనిచేయడం కంటే ఆఫీసుల్లో పనిచేయడమే మేలని అభిప్రాయపడుతున్నారు.
స్కైప్ ద్వారానే పర్యవేక్షణ
టీమ్‌లో పని చేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, మేనేజర్, అమెరికాలో ఉండె క్లయింట్ స్కైప్‌లో అందుబాటులో ఉంటారు. ఎవరెవరు ఏ పని చేయాలో ఉదయం నిర్ణయిస్తారు. పని చేసేటప్పుడు ఎలాంటి అనుమానాలు ఉన్నా వెంటనే నివృత్తి చేస్తారు. డెయిలీ వర్క్ ప్రొగ్రెస్ తెలసుకునేందుకు సాయంత్రం స్కైప్‌లోనే రివ్యూ చేస్తారు. 22 మంది టీమ్ కలిసి ఆన్‌లో మాట్లాడుకుంటూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 7.30 వరకు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాం. – అమర్‌నాథ్ రెడ్డి
పల్స్ సెక్యూర్‌తో లాగిన్
లాక్‌డౌన్‌తో వర్క్ ఫ్రం హోమ్‌కు అవకాశం కల్పించారు. పల్స్ సెక్యూర్ యాప్ ద్వారా ఉద్యోగులకు యాక్సెస్ కల్పిస్తాను. వీపీఎన్ గేట్ వే సాఫ్ట్‌వేర్‌తో సర్వర్ కనెక్ట్ చేసుకుంటారు. ఇంటి నుంచి కూడా యథావిధిగా పని చేస్తున్నాను. – కె.శ్రీనివాస్ రెడ్డి
జుకీ సాఫ్ట్‌వేర్‌తో....
రోబోటిక్స్‌పై వర్క్ చేస్తున్నాను. జుకీ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆఫీస్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతాము. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా అయితేనే అన్నీ ఓపెన్ అవుతాయి. రోజుకు 8 గంటలు ఇంటి నుంచే పని చేస్తున్నాను. ఆన్‌లైన్ ఎప్పకప్పుడు సూచనలు, సలహాలు ఇస్తారు. వర్క్‌లో ఏదైనా సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరిస్తారు. – వైష్ణవి
మొదట్లో ఇబ్బంది పడ్డా
లాక్‌డౌన్ పేరిట మా కంపెనీ ఉద్యోగులందరికి వర్క్ ఫ్రం హోంకు అవకాశం కల్పించింది. ఇంటి నుంచి నాగిన్ అయ్యేందుకు, పని చేసేందుకు రెండు రోజులు ఇబ్బంది పడ్డా. ఇప్పుడు ఆఫీస్‌లో చేసినట్లుగానే పని చేస్తున్నాను. టీమ్ అంతా ఆన్‌లైన్‌లో టచ్‌లో ఉంటూ బాగా వర్క్ చేస్తున్నాం. క్లయింట్‌కు సమయానికి అన్నీ డెలివరీ అవుతున్నాయి. క్లయింట్‌తో ఉదయం, ఆన్‌లైన్‌లోనే మీటింగ్ ఉంటుంది. సాయంత్రం రివ్యూ ఉంటుంది. – రాధిక
ఆఫీసే బెటర్
వర్క్ ఫ్రం హోమ్ కంటె ఆఫీసే బెటర్. ఎలాంటి ఇష్యూ వచ్చినా కొలిగ్స్‌తో ఇంటరాక్ట్ కావడంతో వెంటనే సాల్వ్ అవుతుంది. ఇంటి నుంచి కొద్దిగా లేట్ అవుతుంది. ఆపీస్‌లో ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. వర్క్ ఫ్రం హోమ్‌లో సిస్టిమ్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆఫీస్‌లో పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. అక్కడ టైమ్ ప్రకాం షెడ్యూల్‌ను పూర్తి చేస్తాం, రిలాక్స్‌గా ఉంటుంది. లాగిన్ నా చేతిలోనే ఉండటం, ఇష్యూస్ కారణంగా ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తుంది. – ప్రీతి
ఇప్పుడే ఎక్కువ పని చేస్తున్నాం..
ఆఫీస్ నుంచి చేసే డ్యూటీ కంటే ఇప్పుడే ఎక్కువ పని చేస్తున్నాం. ఉదయం అదనంగా ఇంటర్నల్ కాల్స్ కూడా అంటెండ్ చేస్తున్నాం. హాస్టల్‌లో అందుబాటులో ఉన్న వైఫై ద్వారా 8 గంటలు పని చేస్తున్నా. ఆన్‌లైన్‌లో క్లయింట్‌తో పాటు టీమ్ అంతా అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం గంట సేపు లంచ్ బ్రేక్ ఉంటుంది. ప్రతిరోజూ మెయిల్ ఓపెన్ చేయగానే ఆటోమెటిక్‌గా యాక్సెస్ వస్తుంది. మెసేజ్ పంపిస్తే సిస్టమ్ ప్రాబ్లమ్ ఉన్నాపరిష్కరిస్తారు. – వి.సారిక, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని